HomeWarangal Newsఅపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ | డాక్టర్ కడియం కావ్య

అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ | డాక్టర్ కడియం కావ్య

Published on

spot_img

హనుమకొండ

తేది: 25-01-2026

అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు

హంటర్ రోడ్ లోని ఆకృతి అపార్ట్ మెంట్స్ లో ఏర్పాటు చేసిన అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిధిగా హాజరై 2026 నూతన డైరీని ఆవిష్కరించారు.

Dr Kadiyam Kavya
Dr Kadiyam Kavya

ఈసందర్భంగాఏర్పాటుచేసినసమావేశంలోవరంగల్ఎంపీడా.కడియంకావ్యమాట్లాడుతూ, అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత, భద్రత, పరస్పర సహకారం పెంపొందించడంలో అసోసియేషన్‌ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

అపార్ట్మెంట్లలో నివసిస్తే మంచి సౌకర్యాలు లభిస్తాయనే భావన ప్రజల్లో బలంగా నెలకొనాలని అన్నారు.

అపార్ట్మెంట్ అంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి జీవిస్తూ సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగిస్తూ పండుగలు జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.

Apartment Owners Association
Apartment Owners Association

గతంలో పక్కన నివసించే వారెవరో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి పూర్తిగా మారి అందరూ ఒక కుటుంబంలా కలిసి ప్రతి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.

ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆరోగ్యమే నిజమైన సంపదని చెప్పారు.

అపార్ట్మెంట్ వాసులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.

అపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారానికి తాను ముందుండి కృషి చేస్తానని, ముఖ్యంగా వాటర్ లైన్ వంటి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంపీ డా.కడియం కావ్య హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేశవరెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, ట్రెజరర్ రాజ్ కుమార్, అపార్ట్మెంట్ సభ్యులు, ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.
spot_img

Related Articles

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.