HomeWarangal Newsమహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

భూపాలపల్లి జిల్లా

తేది : 08-02-2026

భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెలీప్యాడ్ వద్ద వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ఘన స్వాగతం పలికారు.

అనంతరం చెల్పూర్ శివారులో నిర్వహించిన బహిరంగ సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ…

మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వ విధానమని, ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తన అభిమానంగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని స్పష్టం చేశారు.

Dr Kadiyam Kavya
Dr Kadiyam Kavya

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద మహిళలకు సొంతింటి కలను నెరవేర్చుతున్నారని తెలిపారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేస్తామన్న లక్ష్యంతో లక్ష కోట్ల రూపాయలను బ్యాంకు లింకేజీ ద్వారా అందిస్తూ, వడ్డీలేని రుణాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. అలాగే ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలపై నిత్యావసరాల భారం తగ్గించిందని వివరించారు.

భూపాలపల్లి జిల్లాకు నూతన రైల్వే లైన్, నవోదయ విద్యాలయం, గనుల ప్రాంతాలకు అధిక భద్రత కల్పించే అంశాలపై తాను పార్లమెంట్లో నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.

అలాగే సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భూపాలపల్లికి ఇప్పటికే రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపిస్తున్నారని చెప్పారు. “అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.

గత పాలకుల హయాంలో భూపాలపల్లి అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్న ఓటే ఆయుధం. ఆ ఆయుధంతో అభివృద్ధిని సాధించుకోవాలి” అని ఎంపీ పిలుపునిచ్చారు.

ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మీ అమూల్యమైన ఓటుతో కాంగ్రెస్‌ను గెలిపించి భూపాలపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ డా.కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.