HomeWarangal Newsసీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ – పేదలకు పెద్ద అండ: ఎంపీ డా. కడియం కావ్య

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ – పేదలకు పెద్ద అండ: ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

హనుమకొండ, ఏప్రిల్ 08: పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరంగా మారిందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు వైద్య చికిత్సల కోసం దరఖాస్తు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తున్నదని ఆమె తెలిపారు.

బుధవారం హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ స్వయంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 10 మంది లబ్ధిదారులకు రూ.3.50 లక్షల విలువైన సహాయనిధి చెక్కులను అందజేశారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, అత్యవసర వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.