ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామం సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 9 గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన మొత్తం ఏడు మంది యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు మృతి చెందగా, మిగిలిన ఐదుగురికి గాయాలయ్యాయి.
మృతులు ఏనుగుల శివ, లోకేష్‌గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ధర్మసాగర్ రిజర్వాయర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


