జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
జిల్లాలోని చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడి చేశారు.
ఈ దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన అర్హతలు లేకుండా ప్రజలకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించిన అధికారులు క్లినిక్‌ను పరిశీలించి మందులను సీజ్ చేశారు.
ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలు అనుమతి లేని వైద్యుల వద్ద చికిత్స పొందకూడదని, అనుమానాస్పద క్లినిక్‌లపై సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.


