HomeWarangal Newsహనుమకొండలో ఉపాధి పనులు 31లోగా పూర్తి చేయాలి – కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండలో ఉపాధి పనులు 31లోగా పూర్తి చేయాలి – కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

Published on

spot_img

హనుమకొండ:

జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి ఈ నెల 31లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సమావేశంలో డీఆర్‌డీవో మేన శ్రీను, డీపీవో లక్ష్మీ రమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ సైదుల్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్దార్థ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Video Conference

కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల వారీగా ఉపాధి హామీ పనుల పెండింగ్‌పై ఎంపీడీవోలు సమీక్ష చేయాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో వందశాతం ఇంటి పన్నుల వసూలు సాధించాలని ఆదేశించారు.

పన్నుల వసూళ్లలో 50 శాతం కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. ఎంపీవోలు వారంలో నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు.

గ్రామాలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తను తడి-పొడి వేరు చేసి వందశాతం సెగ్రిగేషన్ చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం రెండు గ్రామపంచాయతీలను ఆదర్శంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శులు ఉదయం 9 గంటలకు విధుల్లో హాజరు కావాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ సమావేశంలో డీఎల్పివోలు రవిబాబు, గంగభవాని సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest articles

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.