గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని జాన్పాకలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారితో కలిసి వరంగల్ కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ముస్లిం మత పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని రంజాన్ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.


