వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు.
ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారు హాజరయ్యారు. నిర్వాహకులతో కలిసి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయుల ఆశయాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని అన్నారు.

వారి పేర్లతో జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం ద్వారా సేవాభావాన్ని ప్రోత్సహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో సంస్థకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి జాతీయ పురస్కారాలను అతిథులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, డాక్టర్ వంగాల శాంతికృష్ణ ఆచార్య, పోలోజు రాజ్ కుమార్ ఆచార్య, డాక్టర్ వంగల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.


