HomeWarangal Newsకాజీపేట ROB పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేట ROB పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Published on

spot_img

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు బుధవారం కాజీపేట ఫాతిమా నగర్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను స్థానిక రోడ్లు & భవనాల (R&B) శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే, అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ప్రజల రవాణా సౌకర్యాల కోసం ఈ ROBను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిందని తెలిపారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల – ముఖ్యంగా రైల్వే శాఖ అనుమతులు, భారీ యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తరలించడం వంటివి – పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.

అయితే, రైల్వే అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ సమస్యలను పరిష్కరిస్తున్నామని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

మేడారం జాతర సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నగరంలోని వివిధ బ్రిడ్జిల పనులను వేగంగా పూర్తి చేయడానికి అన్ని ఎమ్మెల్యేలు సమిష్టిగా కృషి చేస్తున్నారని, ప్రజల సౌకర్యమే ప్రధాన ధ్యేయమని తెలిపారు.

ఇప్పటికే NIT నుంచి హంటర్ రోడ్డు వరకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమైనట్లు, ఇవి పూర్తయితే నగర రాకపోకలు మరింత సుగమం అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.