HomeWarangal Newsప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Published on

spot_img

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

హనుమకొండ జిల్లా, గీసుగోండ మండలం: గీసుగోండ మండలం మరియు 15, 16 డివిజన్ల పరిధిలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం కొనయమాకుల రైతు వేదికలో జరిగింది.

పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులను అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 46 మంది లబ్ధిదారులకు 46 లక్షల 5 వేల 336 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను, 35 మంది లబ్ధిదారులకు 16 లక్షల 20 వేల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు.

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ చీరల పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Latest articles

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.
spot_img

Related Articles

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.