HomeWarangal Newsభూపాలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమలో పాల్గొన్న కడియం కావ్య

భూపాలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమలో పాల్గొన్న కడియం కావ్య

Published on

spot_img

భూపాలపల్లి

తేది: 24-01-2026

భూపాలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ కూడలిలో 6 కోట్లతో చేపట్టనున్న కూడళ్ళు అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు శంకుస్థాపన చేశారు.

అనంతరం భరత్ కన్వెన్షన్ హాల్ లో మునిసిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీతో పాటు వడ్డీ లేని రుణాలు, చేనేత రుణాలు మాఫీ ఉత్తర్వులను అందచేశారు.

కడియం కావ్య
తుమ్మల నాగేశ్వర రావు

ఈ సందర్భంగా జరిగిన సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ,.. భూపాలపల్లికి కొత్త రైల్వే లైన్, నూతన రహదారులు, విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎంపీ స్పష్టం చేశారు.

జిల్లాలోని చారిత్రక నాపాక ఆలయం, కోటగుళ్ల (ఘన్‌పూర్) దేవాలయాలను ప్రసాద్ స్కీం లో చేర్చి అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.

భూపాలపల్లి బైపాస్ రోడ్డు డీపీఆర్ దశలో ఉందని తెలిపారు. అలాగే భూపాలపల్లిలో చిల్లీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానన్నారు.

పబ్లిక్ మీటింగ్
పబ్లిక్ మీటింగ్

ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు.

గత ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల పాటు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భూపాలపల్లిలో 50 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

అలాగే 110 మంది నేతన్నలకు రుణమాఫీ చేశామని వెల్లడించారు.

కడియం కావ్య
కడియం కావ్య

రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో 130 గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, అలాగే రాబోయే మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డును గెలిపించుకోవాలనే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే మరో 50 కోట్లు తీసుకువస్తారని తెలిపారు.

ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.

కడియం కావ్య
కడియం కావ్య

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , ఎస్పీ సంకీర్త్, రాష్ట్ర వేర్‌ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, చిట్యాల.మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీదేవి, ఆర్డీవో హరికృష్ణ, డీఆర్‌డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు.

Latest articles

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.
spot_img

Related Articles

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.