HomeWarangal Newsప్రపంచ రెడ్ క్రాస్ – తలసీమియా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ప్రపంచ రెడ్ క్రాస్ – తలసీమియా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య

spot_img

హనుమకొండ రెడ్ క్రాస్ భవన్‌లో నిర్వహించిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు అంతర్జాతీయ తలసీమియా దినోత్సవ వేడుకలకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమానికి ముందు ఎంపీ కడియం కావ్య ‘ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్’ను సందర్శించి అక్కడి వృద్ధులతో ముచ్చటించారు. వారితో కలిసి క్యారం బోర్డు ఆడుతూ ఉత్సాహాన్ని నింపారు.

అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ తలసీమియా వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.

అంతర్జాతీయ తలసీమియా దినోత్సవం సందర్భంగా తలసీమియా బాధితులకు పండ్లు పంపిణీ చేసి, వారికి రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను అభినందించారు.

Dr Kadiyam Kavya

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు.

ఈ సందర్భంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 20 మంది కార్మికులకు కిచెన్ సెట్లు, బ్లాంకెట్లను ఎంపీ పంపిణీ చేశారు.

సమావేశంలో మాట్లాడిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్తకేంద్రం, తలసీమియా కేంద్రం, జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సేవలు ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు.

ప్రస్తుతం వేసవి కాలంలో రక్త కొరత అధికంగా ఉంటోందని, తలసీమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం ప్రాణాధారమని పేర్కొన్నారు. యువత, సేవా సంస్థలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త కొరత లేకుండా చూడాలని పిలుపునిచ్చారు.

రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని అభినందించిన ఎంపీ.. తాను కూడా రెడ్ క్రాస్ సభ్యత్వం స్వీకరించి సంస్థ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ పాలకవర్గం ఎంపీ డాక్టర్ కడియం కావ్యను ఘనంగా సత్కరించింది.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర, జిల్లా పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు – వరంగల్ సీపీ ఎన్. శ్వేతా, ఐపీఎస్

ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేతా సూచించారు.

వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత: పైప్‌లైన్ మరమ్మతుల వివరాలు

మడికొండ రైల్వే ట్రాక్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత. ప్రభావిత ప్రాంతాల వివరాలు, అధికారుల సూచనలు ఇక్కడ చూడండి.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.