సత్య శారద గారు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు వంటి భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. కౌంటింగ్ హాల్‌లో అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది సన్నద్ధత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సత్య శారద గారు స్పష్టం చేశారు.


