HomeWarangal Newsబాధ్యతను మించిన మానవత్వం.. ఆపదలో అండగా నిలిచిన పర్వతగిరి సీఐ రాజగోపాల్..!

బాధ్యతను మించిన మానవత్వం.. ఆపదలో అండగా నిలిచిన పర్వతగిరి సీఐ రాజగోపాల్..!

Published on

spot_img

బాధ్యతను మించిన మానవత్వం.. ఆపదలో అండగా నిలిచిన పర్వతగిరి సీఐ రాజగోపాల్..:

వరంగల్ నగర పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులకు సకాలంలో సహాయం చేసి పర్వతగిరి సీఐ రాజగోపాల్ మానవత్వాన్ని చాటుకున్నారు. విధులకు వెళ్తున్న సమయంలో జేఎస్ఎం కళాశాల సమీపంలో కారు, స్కూటీ ఢీకొన్న ప్రమాదాన్ని ఆయన గమనించారు. ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడివుండగా, పరిస్థితిని చూసిన సీఐ వెంటనే స్పందించారు.

చుట్టుపక్కల వారు గుమికూడినప్పటికీ, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఆలస్యం జరుగుతున్నట్లు గుర్తించిన రాజగోపాల్ స్వయంగా చర్యలు చేపట్టారు. వెంటనే ఒక ఆటోను ఏర్పాటు చేసి, గాయపడిన వ్యక్తిని అందులో ఎక్కించి ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అంతటితో ఆగకుండా, తానే ఆటోలో వెళ్లి బాధితులతో పాటు హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి బాధితులకు తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంతో భయాందోళనలకు గురైన దంపతులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహకారం అందించారు. సీఐ చూపిన చొరవ కారణంగా బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందిందని స్థానికులు పేర్కొన్నారు.

ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే చూసీచూడనట్లు వెళ్లిపోయే ఈ రోజుల్లో.. ప్రమాదంలో ఉన్న అపరిచితుల ప్రాణాలను కాపాడేందుకు రాజగోపాల్ చూపిన స్పందన అందరి ప్రశంసలను అందుకుంటోంది. పోలీసు విధులతో పాటు మానవతా విలువలను కూడా సమానంగా పాటిస్తూ ఆయన చేసిన సేవ ప్రజల్లో సానుకూల చర్చకు దారితీసింది. సీఐ రాజగోపాల్ వ్యవహరించిన తీరు యువతకు ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.