వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద గారు తనిఖీ చేశారు. ‘99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, భోజన ఏర్పాట్లు, తరగతి గదులు, హాస్టల్ సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినుల చదువు, ఆరోగ్యం మరియు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


