HomeWarangal Newsకాళేశ్వరం క్షేత్రంలో భక్తిరస ప్రవాహం.. ఆరో రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు..!

కాళేశ్వరం క్షేత్రంలో భక్తిరస ప్రవాహం.. ఆరో రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు..!

Published on

spot_img

సరస్వతి అంత్య పుష్కరాలు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఆధ్యాత్మిక వైభవంగా కొనసాగుతున్నాయి. పుష్కరాల ఆరవ రోజున త్రివేణి సంగమం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

ఉదయం నుంచి భక్తులు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరించారు.

సరస్వతి అంత్య పుష్కరాల్లో ప్రత్యేక పూజలు

పుణ్యస్నాల అనంతరం సైకత లింగాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు కలిసి పుష్కర స్నానాలు చేయడంతో పాటు పితృ తర్పణాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నదిలో దీపాలను వదులుతూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.

అనంతరం భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ శుభానంద దేవి, శ్రీ సరస్వతి దేవి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కాళేశ్వరంలో ప్రత్యేక ఏర్పాట్లు

సరస్వతి అంత్య పుష్కరాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసు శాఖ, వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి.

పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ఆధ్యాత్మిక కాంతులతో మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.