రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల పనితీరు, రైతులకు చెల్లింపులు, ధాన్యం రవాణా, గోదాముల నిల్వ సామర్థ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

వరి ధాన్యం సేకరణలో జిల్లాల వారీ సమీక్ష
ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చే వారం నిర్వహించనున్న మహిళా సంక్షేమ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక, అవసరమైన ఏర్పాట్లపై కూడా అధికారులు చర్చించారు. జిల్లాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

హన్మకొండ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, డీసీపీ ధార కవిత, అదనపు కలెక్టర్ రవి తదితర జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వరి ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


