HomeWarangal NewsMLA నాయిని రాజేందర్ రెడ్డిపై దుష్ప్రచారం మానుకోవాలి: డీసీసీ చీఫ్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

MLA నాయిని రాజేందర్ రెడ్డిపై దుష్ప్రచారం మానుకోవాలి: డీసీసీ చీఫ్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

Published on

spot_img

ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మరీ ముఖ్యంగా న్యూ శాయం పేట హనుమాన్ విగ్రహ విషయంలో ఆయనను కావాలని లాగుతూ ఆయన తప్పు లేకపోయినా సరే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

దీనిపై తాజాగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ఇనగల వెంకట్రామ్ రెడ్డి స్పందించారు.

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..”బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పై నిరాధర ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదు” అని స్పష్టం చేశారు.

అంతేకాదు ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రస్తావిస్తూ ఆయనను కొనియాడారు. ఆయన నిజాయితీ గురించి చెబుతూ అడ్డిమారి దెబ్బలో గెలిచిన నాయకుడు నాయిని కాదు అని.. ప్రజల ఆశీస్సులతో గెలిచి అభివృద్ధి కోసం పనిచేస్తున్న నీతి నిజాయితీ గల నాయకుడని పొగిడేశారు.

ఆలయ వ్యవహారాలకు సంబంధం లేని ఎమ్మెల్యే ని ఉద్దేశ పూర్వకంగానే అనవసర విషయాలలో లాగడం రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు.

విగ్రహాల పేరుతో రాజకీయ పబ్బం గడపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు అని తీవ్రంగా మండిపడ్డారు . బీఆర్ఎస్, బిజెపి కలిసి ప్రజలను తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తుంది అని మండిపడ్డారు.

సర్వేలలో కేటీఆర్ గ్రాఫ్ తీవ్రంగా పడిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపుతూ ఆయన ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని విమర్శించారు.

నగరంలోని ఖాళీ స్థలాలలో దేవుడి విగ్రహాలు ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అని ఘాటుగా విమర్శించారు.

ఎమ్మెల్యే నాయినికి భక్తి ఎక్కువ అని.. ఆయన నిబద్ధత ఏంటో ప్రజలకు తెలుసని.. కావాలని తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.

మొత్తం ఆలయ వ్యవహారంలో నిజమైన హనుమాన్ భక్తుడు ఒకరే ఒకరు ఉన్నారని ఆయనే నాయిని రాజేందర్ రెడ్డి అని పొగిడేశారు.

మిగతా హడావుడి అంత బిఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రదర్శన మాత్రమేనని విమర్శించారు. అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారిని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.