HomeWarangal Newsవరంగల్‌లో కట్టుదిట్టమైన నాకా బందీ.. అనుమానితులపై నిఘా

వరంగల్‌లో కట్టుదిట్టమైన నాకా బందీ.. అనుమానితులపై నిఘా

Published on

spot_img

వరంగల్‌లో కట్టుదిట్టమైన నాకా బందీ.. అనుమానితులపై నిఘా:

నేరాల నియంత్రణతో పాటు పాత నేరస్తుల కదలికలను గుర్తించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నాకా బందీ తనిఖీలు నిర్వహించినట్లు సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 11286 వాహనాలను పరిశీలించినట్లు వెల్లడించారు.

జోన్ల వారీగా తనిఖీలు:

సెంట్రల్ జోన్ పరిధిలో 5626 వాహనాలు, ఈస్ట్ జోన్ లో 2591 వాహనాలు, వెస్ట్ జోన్లో 57 వాహనాలు, ట్రాఫిక్ విభాగం పరిధిలో 992 వాహనాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ కారణాలతో మొత్తం 275 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 197 మంది పట్టివేత:

నాకా బందీ తనిఖీల్లో భాగంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 197 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

అక్రమ రవాణా పై కేసులు నమోదు :

శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే దామోర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై మరో రెండు కేసులు నమోదు చేశారు. ఇంతేజర్ గంజి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు:

ప్రజల భద్రత కోసం ఇలాంటి నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు – వరంగల్ సీపీ ఎన్. శ్వేతా, ఐపీఎస్

ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేతా సూచించారు.

వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత: పైప్‌లైన్ మరమ్మతుల వివరాలు

మడికొండ రైల్వే ట్రాక్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత. ప్రభావిత ప్రాంతాల వివరాలు, అధికారుల సూచనలు ఇక్కడ చూడండి.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.