HomeWarangal Newsదావోస్‌లో తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Published on

spot_img

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) 2026 సదస్సు నిర్వహణలో దావోస్‌లో మూడు రోజుల పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికత, రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలు, సమగ్రాభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి బలంగా చాటడంలో బృందం సఫలమైంది.

❇️ గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిన నేపథ్యంలో, దావోస్‌లో పెట్టుబడులకు అతీతంగా రాష్ట్ర దీర్ఘకాలిక విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రభుత్వ సంకల్పం నెరవేరింది.

❇️ మూడు రోజుల పర్యటనలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ & గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ వంటి రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.

❇️ ముఖ్యమంత్రి గారు WEF నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. దావోస్ సదస్సు తర్వాత జూలై-ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది.

❇️ మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు, ప్రత్యేక సెషన్ల తర్వాత గురువారం సాయంత్రం తెలంగాణ బృందం దావోస్ పర్యటన ముగించుకుంది.

❇️ పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు జూరిచ్ బయలుదేరి, అక్కడి నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గార్లు దావోస్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది!

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.