HomeWarangal Newsతొర్రూరు | మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తొర్రూరు | మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Published on

spot_img

తొర్రూరు

తేది: 26-01-2026

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు..

ఎంపీ కడియం కావ్య
Dr Kadiyam Kavya

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.15 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీ లో ఎంపీ డా.కడియం కావ్య గారు పాల్గొన్నారు.

MLA Yashaswini Reddy
MLA Yashaswini Reddy

BR కన్వెన్షన్ లో నిర్వహించిన తొర్రూరు పట్టణ మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న వరంగల్ వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు.

Public Meeting
Public Meeting

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు భూక్యా ఉమా నాయక్, జిల్లా కలెక్టర్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Latest articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 
spot_img

Related Articles

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.