భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్. కడియం కావ్య హనుమకొండలో ఘనంగా నివాళులు అర్పించారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన ఆమె అనంతరం ఎంజీఎం సర్కిల్ మరియు గీసుగొండ మండలంలోని కోనాయిమాకుల వద్ద ఉన్న విగ్రహాలకు కూడా నివాళులు సమర్పించారు.

అదేవిధంగా గీసుకొండ మండలం కెఎంటీపీ రెసిడెన్షియల్ లేఅవుట్ గ్రామంలో 58 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగల వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..”రాజీవ్ గాంధీ దేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన దూరదృష్టి గల నాయకుడని పేర్కొన్నారు”.

టెలికాం సమాచార సాంకేతిక రంగాలకు ఆయన బలమైన పునాది వేశారని చెప్పారు.
గ్రామీణ అభివృద్ధి మహిళా సాధికారత, పంచాయితీ రాజ్ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని..కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై ధరల భారం మోపుతుంది అని విమర్శించారు.

రాహుల్ గాంధీ ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ఎదుగుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


