HomeWarangal Newsవరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు

వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు

Published on

spot_img

వరంగల్ తేదీ: 22-01-2026

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని గురువారం వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె అక్కడి శాస్త్రవేత్తలతో సమావేశమై, వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనల పురోగతి, రైతులకు అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయం, కొత్త పంటల అభివృద్ధి వంటి అంశాలపై వివరంగా చర్చించారు.

ముఖ్యంగా పత్తి, వరి వంటి ప్రధాన పంటల సాగు విధానాలు, రైతులకు లాభదాయకంగా ఉండేలా అనుసరించాల్సిన పద్ధతుల గురించి శాస్త్రవేత్తల నుంచి సమాచారం సేకరించారు.

ఎంపీ డా. కడియం కావ్య
కడియం కావ్య

ఈ సందర్భంగా మాట్లాడిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, ఈ ప్రాంత రైతుల అవసరాలకు తగినట్లుగా పరిశోధనలను మరింత ఉపయోగకరంగా రూపొందించాలని, శాస్త్రవేత్తలు-రైతుల మధ్య సంబంధాలను మరింత బలపరచాలని సూచించారు.

వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే పరిశోధన ఫలితాలు నేరుగా రైతుల చేతికి అందాలని ఆమె పేర్కొన్నారు. అలాగే వరంగల్ టెక్స్‌టైల్ రంగానికి అనుసంధానంగా స్థానికంగా పండించిన పత్తిని సమర్థవంతంగా వినియోగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఉద్యాన పంటలైన మిరప, మామిడి, పసుపు, పత్తి వంటి పంటలపై పరిశోధనలు వరంగల్ ప్రాంతంలోనే జరిగేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తే, వాటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమలు చేయించేందుకు కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పండుతున్న పత్తి, వరి అవశేషాలను తగలబెట్టకుండా, నేలలోనే కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా మార్చే విధంగా షెడ్డర్లు, మల్చర్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు.

అనంతరం డా. కడియం కావ్య అక్కడ జరుగుతున్న వివిధ పంటల పరిశోధనలను స్వయంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఉమా రెడ్డి, అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్ రవీందర్ నాయక్, వివిధ శాస్త్రవేత్తలు, మాజీ కార్పొరేటర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు – వరంగల్ సీపీ ఎన్. శ్వేతా, ఐపీఎస్

ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేతా సూచించారు.

వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత: పైప్‌లైన్ మరమ్మతుల వివరాలు

మడికొండ రైల్వే ట్రాక్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత. ప్రభావిత ప్రాంతాల వివరాలు, అధికారుల సూచనలు ఇక్కడ చూడండి.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.