వరంగల్ జిల్లా:
పున్నెల్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ వెంచర్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పడి ఇద్దరు చిన్నారులు, ఓ వివాహిత మహిళ మృతి చెందారు.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ముగ్గురు ఒకేసారి పూల్‌లో పడిపోవడానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల అనుమానం:
ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.


