HomeWarangal Newsమహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

Published on

spot_img

మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్:

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్మసాగర్ మండలం పెండ్యాల గ్రామంలో రెవెన్యూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ.. గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.

“మహిళలు అన్ని రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. మహిళల అభివృద్ధి, భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు . ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మహిళలకు సూచించారు. మహిళలు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించి ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రోత్సహించాలని చెప్పారు. కుటుంబం, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ పై కూడా సీపీ అవగాహన కల్పించారు. ప్రతి వాహనా దారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. బాధ్యతాయుతంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చు అని తెలిపారు. ప్రజల సహకారంతో సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ గ్రామ సభలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళల భద్రత, విద్య, ట్రాఫిక్ అవగాహన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.