HomeWarangal Newsఅక్కినపల్లిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

అక్కినపల్లిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

spot_img

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అక్కినపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బొడ్రాయి మరియు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు పాల్గొన్నారు.

రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామ్ నర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సాంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు – వరంగల్ సీపీ ఎన్. శ్వేతా, ఐపీఎస్

ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేతా సూచించారు.

వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత: పైప్‌లైన్ మరమ్మతుల వివరాలు

మడికొండ రైల్వే ట్రాక్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత. ప్రభావిత ప్రాంతాల వివరాలు, అధికారుల సూచనలు ఇక్కడ చూడండి.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.