హనుమకొండ: నగరంలోని వడ్డేపల్లి బండ్‌పై చేపడుతున్న సుందరీకరణ పనులను, ఇందులో భాగంగా నిర్మిస్తున్న ఫుడ్ స్ట్రీట్ పనుల పురోగతిని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల నాణ్యతను పరిశీలించిన ఆయన, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.


