వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం తెల్లవారుజామున ఉద్రిక్తత చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ యాదగిరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
ఇటీవల మార్కెట్‌లో మిర్చి బస్తాల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆటోలో వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను యాదగిరి ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో యాదగిరి తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన యాదగిరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.


