కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ ఫైర్..దిష్టిబొమ్మ దహనాన్ని ఖండించిన రవికుమార్:
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ చట్టబద్ధంగా తిరస్కరణకు గురికావడాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల దిష్టిబొమ్మను తగలబెట్టడం అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పట్ల, దేశ చట్టాల పట్ల కనీస గౌరవం లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైందని ఆయన మండిపడ్డారు.
సొంత తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలు :
అఫిడవిట్‌లో కోర్టు కేసుల వివరాలు, ఆస్తుల సమాచారాన్ని సమగ్రంగా పొందుపరచకుండా నిబంధనలను ఉల్లంఘించింది కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్. తప్పు మీ వైపు పెట్టుకుని, రిటర్నింగ్ అధికారి చట్టప్రకారం నామినేషన్ తిరస్కరిస్తే, దానికి ప్రధాని మోడీ గారికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యపై కాంగ్రెస్ దాడి:
ఎన్నికల సంఘం (ECI) స్వతంత్రంగా, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లాభం పొందాలని చూడటం, విఫలమయ్యాక వీధుల్లోకి వచ్చి అరాచకాలు సృష్టించడం కాంగ్రెస్ మార్కు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
మోడీ గారి ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఈ చర్యలు :
మూడోసారి ప్రధానిగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారిపై ఉన్న రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకులు ఈ దిష్టిబొమ్మల దహనానికి పాల్పడుతున్నారు. దీన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు, బీజేపీ శ్రేణులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.
చట్టపరమైన చర్యలకు డిమాండ్ :
దేశ ప్రధాని దిష్టిబొమ్మను తగలబెట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు తక్షణమే సుమోటోగా కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. తప్పులు చేయడం, దొరికిపోయాక ఇతరులపై ఏడవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, వరంగల్ జిల్లా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


