HomeWarangal Newsకాజీపేట: బాపూజీ నగర్‌లో మహిళ మెడలో గొలుసు లాకెళ్లిన దుండగులు

కాజీపేట: బాపూజీ నగర్‌లో మహిళ మెడలో గొలుసు లాకెళ్లిన దుండగులు

Published on

spot_img

కాజీపేట: పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బాపూజీ నగర్ లాంటి రద్దీ ప్రాంతంలో మహిళ మెడలో నుండి బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానిక బాపూజీ నగర్‌లో నివసించే ధనలక్ష్మి అనే మహిళ తన పని ముగించుకుని కారుణ్య క్లీనిక్ సమీపం గుండా ఇంటికి వెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు మెరుపు వేగంతో ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును బలంగా లాక్కొని, క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యారు.

బాధిత మహిళ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాపూజీ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి గాలింపు చర్యలు చేపట్టారు.

​ఈ దారుణ ఘటనతో బాపూజీ నగర్ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. జన సంచారం ఉండే ప్రాంతంలోనే ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.