HomeWarangal Newsఈవీఎంల భద్రతపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సమీక్ష.. గోదాం తనిఖీ

ఈవీఎంల భద్రతపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సమీక్ష.. గోదాం తనిఖీ

Published on

spot_img

ఈవీఎంల భద్రతపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సమీక్ష.. గోదాం తనిఖీ :

హనుమకొండ: ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు) భద్రతపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి శనివారం సుబేదారిలోని రెడ్ క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎంలు, వివిప్యాట్‌లు భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా ఈ పరిశీలన చేపట్టారు. గోదాములో భద్రపరిచిన ఈవీఎంలు ఈవీఎంలు, వివిప్యాట్‌లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు తదితర ఎన్నికల సామగ్రిని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. నిల్వ గదుల పరిస్థితి, భద్రతా ఏర్పాట్లు, యంత్రాల సంరక్షణ విధానాలను సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

అదేవిధంగా గోదాం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి.. భద్రతా వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి భద్రతా విషయంలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు.

ఈ తనిఖీల్లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీవో వెంకటేష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హాజరై తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రతపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు.

Latest articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.