హన్మకొండ వేదికగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. నిరుద్యోగుల గొంతుకగా మారిన యువజన కాంగ్రెస్, కాకతీయ యూనివర్సిటీ (KU) మొదటి గేటు వద్ద భారీ నిరసన చేపట్టింది.
నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భానును వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాటిని తక్షణమే అమలు చేయాల్సిందే అని ఆదేశించారు.
నిరుద్యోగుల ఆవేదన వినపడలేదా? ఇచ్చిన హామీలు నీటి మూటలేనా?” అంటూ యువజన కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. చేతుల్లో ప్రధాని మోదీ చిత్రపటాలను పట్టుకుని వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ నిరసనలో అలువాల కార్తీక్, రాహుల్, వర్ధన్ తదితర నేతలు పాల్గొన్నారు.


