నగరంలో ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. డ్రగ్స్ మరియు గంజాయి మత్తులో యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, విచక్షణ కోల్పోయి గొడవలకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మత్తు భూతాన్ని తరిమికొట్టేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కఠిన చర్యలు చేపట్టారు.
గతంలో డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారి కదలికలను నిరంతరం పర్యవేక్షించడం, మత్తుకు బానిసలైన యువతను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తూ అవగాహన కల్పించడం. విక్రేతలు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించాలని సీపీ ఆదేశించారు.
కేవలం పోలీసులు మాత్రమే కాకుండా, స్థానిక ప్రజలు మరియు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని సీపీ కోరారు.


