HomeWarangal Newsవరంగల్‌లో బొగ్గు రవాణా కాలుష్యం పై లోక్‌సభలో ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్న

వరంగల్‌లో బొగ్గు రవాణా కాలుష్యం పై లోక్‌సభలో ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్న

Published on

spot_img

న్యూఢిల్లీ / పార్లమెంట్

తేది: 04-02-2026

వరంగల్ జిల్లాలో బొగ్గు రవాణా వల్ల కలిగే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలపై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గారు

వరంగల్ జిల్లాలో బొగ్గు రవాణా వల్ల కలిగే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలపై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బొగ్గు రవాణా, దానికి అనుబంధ లాజిస్టిక్స్ కారణంగా రహదారి, రైలు మార్గాల్లో కాలుష్యం పెరుగుతోందా? వరంగల్ జిల్లాపై దాని ప్రభావం ఏ మేరకు ఉందో అధ్యయనం చేశారా? దుమ్ము కాలుష్యం తగ్గించేందుకు, ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరాలు ఇవ్వాలని ఎంపీ డా.కడియం కావ్య , కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కోరారు.

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గారు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

వరంగల్‌కు సమీపంలో ఉన్న బొగ్గు గనులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ప్రాంతంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆధీనంలో ఉన్నాయని తెలిపారు.

ప్రతిరోజూ సుమారు 4 వేల టన్నుల బొగ్గును భూపాలపల్లి గనుల నుంచి ఉప్పల్ రైల్వే సైడింగ్‌కు రహదారి మార్గంలో టార్పాలిన్ కవర్లు వేసిన లారీల ద్వారా సుమారు 56 కిలోమీటర్ల మేర తరలిస్తున్నట్లు తెలిపారు.

బొగ్గు రవాణా ప్రభావాలపై EPTRI ద్వారా గాలి నాణ్యత, శబ్ద కాలుష్యం, నీటి నాణ్యత, సామాజిక అంశాలపై అధ్యయనాలు నిర్వహించామని, ట్రాఫిక్ ప్రభావ అంచనా నివేదికలు కూడా సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు.

పర్యావరణ అనుమతుల నిబంధనలు, కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తున్నామని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పర్యావరణ అనుసరణ నివేదికలు సమర్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

డ్రైవర్లకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై కూడా దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

బొగ్గు రవాణా కారణంగా వరంగల్ ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు లేకుండా చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈమేరకు వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు ఇవి సరిపోతాయా? అంటూ ఎంపీ డా.కడియం కావ్య గారు ప్రశ్నించారు.

బొగ్గు లారీల వల్ల గ్రామాల గుండా దుమ్ము మబ్బుల్లా ఎగసిపడుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఎంపీ డా.కడియం కావ్య తెలిపారు.

కేంద్రం చెబుతున్న నివేదికలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ, కేవలం కాగితాలపై కాకుండా వాస్తవంగా దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు అమలు చేయాలని కేంద్రాన్ని ఎంపీ కోరారు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు – వరంగల్ సీపీ ఎన్. శ్వేతా, ఐపీఎస్

ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేతా సూచించారు.

వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత: పైప్‌లైన్ మరమ్మతుల వివరాలు

మడికొండ రైల్వే ట్రాక్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత. ప్రభావిత ప్రాంతాల వివరాలు, అధికారుల సూచనలు ఇక్కడ చూడండి.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.