కాజీపేటలో సైబర్ నేరగాళ్లు పోలీసుల వేషంలో ఒక వ్యక్తిని బురిడీ కొట్టించి దాదాపు రూ. 96,000 కాజేశారు.
సైబర్ నేరగాళ్లు బాధితుడిని వాట్సాప్ ద్వారా సంప్రదించారు. తాము లక్నో పోలీసులమని పరిచయం చేసుకున్నారు. బాధితుడు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, అతనిపై కేసు నమోదు చేస్తామని భయపెట్టారు.
పోలీసులమని నమ్మిన బాధితుడు, భయాందోళనతో వారు అడిగిన మొత్తాన్ని వారి ఖాతాకు బదిలీ చేశాడు.
తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


