హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మే 5, 6, 7 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వెల్లడించారు. శనివారం మేళాకు సంబంధించి మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమం కోసం నియమించిన కమిటీలు, నోడల్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.


