గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రత్యేక అధికారిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
గురువారం మధ్యాహ్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ఛాంబర్లో స్పెషల్ ఆఫీసర్గా ఆమె విధుల్లో చేరారు.
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల సమస్యలు, మంచినీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని ఆమె స్పష్టం చేశారు.


