HomeWarangal Newsహన్మకొండలో చైన్ స్నాచర్లు అరెస్ట్: రెండు తులాల గోల్డ్ చైన్ స్వాధీనం

హన్మకొండలో చైన్ స్నాచర్లు అరెస్ట్: రెండు తులాల గోల్డ్ చైన్ స్వాధీనం

Published on

spot_img

జల్సాలకు అలవాటు పడి నేరాల బాట పట్టిన ఇద్దరు యువకులను హనుమకొండ మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 2 లక్షల రూపాయల విలువైన రెండు తులాల బంగారు పుస్తేల తాడును స్వాధీనం చేసుకున్నారు.

​ నిందితులు ఇద్దరు హనుమకొండలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ, విలాసాల కోసం ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నెల 4వ తేదీన పెద్దమ్మ గడ్డ ఏరియాలో ప్రయత్నించి విఫలమవ్వగా, మే 5వ తేదీన బొక్కలగడ్డ ప్రాంతంలో ఓ మహిళ మెడలోని రెండు తులాల పుస్తెల తాడును తెంపుకుని బైక్‌పై పారిపోయారు.

దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. నిందితులను చీకటి రాహుల్ (21, తొర్రూరు), ఉట్కూరి సాయి కిరణ్ (22, గోవిందరావుపేట)గా గుర్తించారు.

హన్మకొండ ఇన్ స్పెక్టర్ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ.. యువత మత్తుకు, జల్సాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వారికి డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు.

​రికవరీ చేసిన వస్తువులు:

•​ రెండు తులాల బంగారు పుస్తెల తాడు

• ​ఒక మోటార్ సైకిల్

• ​ఒక సెల్ ఫోన్

నేరాన్ని తక్కువ సమయంలో ఛేదించిన ఇన్ స్పెక్టర్లు మచ్చ శివకుమార్, రాఘవేంద్ర, రామకృష్ణ మరియు సిబ్బందిని హన్మకొండ ఏసీపీ అభినందించారు.

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.