హన్మకొండ (క్రైమ్/సిటీ బ్యూరో): హన్మకొండలోని DCC కార్యాలయంలో చరఖా అభ్యాస శిక్షణ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ, నేటి తరానికి చరఖా ప్రాముఖ్యతను వివరించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,కుడా (KUDA) చైర్మన్ వెంకటరామిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. చరఖా అనేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదని, అది స్వయం సమృద్ధికి మరియు దేశభక్తికి చిహ్నమని తెలిపారు. ప్రజలందరూ ఈ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.


