HomeWarangal Newsట్రాఫిక్ సిబ్బందికి చలువ అద్దాల పంపిణీ: అదనపు డీసీపీ ప్రభాకర్ రావు

ట్రాఫిక్ సిబ్బందికి చలువ అద్దాల పంపిణీ: అదనపు డీసీపీ ప్రభాకర్ రావు

Published on

spot_img

హన్మకొండ: వేసవికాలంలో భానుడి భగభగలకు విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ శరత్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, సిబ్బందికి చలువ అద్దాలను (Cooling Glasses) పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా అదనపు డీసీపీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నిరంతరం రోడ్లపై విధులు నిర్వహించే వారికి కంటి సమస్యలు రాకుండా ఈ చలువ అద్దాలు ఉపయోగపడతాయని తెలిపారు. సామాజిక బాధ్యతగా ఈ అద్దాలను పంపిణీ చేసిన శరత్ కంటి ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.

​ఈ కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి సీతారెడ్డి, శరత్ కంటి ఆసుపత్రి ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.