హన్మకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ మంత్రి రామకృష్ణ సునీతను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
అదాలత్ వద్ద ఉన్న కోర్టు సముదాయంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, జస్టిస్ సునీతకు ఒక మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


