హన్మకొండ జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర రెడ్డితో కలిసి పలు కేసుల్లో రాజీ పడిన ఇరుపక్షాల కక్షిదారులకు సెటిల్మెంట్ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా, పరస్పర అంగీకారంతో వివాదాలను ముగించుకోవాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.


