హనుమకొండ: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడి వైద్య చికిత్స కోసం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు.
మంజూరైన ఎల్ఓసీ చెక్కును మంగళవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎంపీ అందజేశారు. ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఎంపీ డాక్టర్ కడియం కావ్యకు బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


