కాకతీయ యూనివర్సిటీలో కలకలం రేపిన విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై వర్సిటీ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీవిద్య మృతిపై నియమించిన అంతర్గత కమిటీ తన నివేదికను సమర్పించింది.
ఈ నివేదికలోని అంశాల ఆధారంగా, ఆత్మహత్యకు కారణమైనట్లు భావిస్తున్న కెమిస్ట్రీ మరియు బయోటెక్నాలజీ విభాగాలకు చెందిన మొత్తం ఆరుగురు విద్యార్థులపై విశ్వవిద్యాలయం వేటు వేసింది. వీరిని ఒక సెమిస్టర్ పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


