HomeLatest Newsకరీంనగర్‌లో భారీ దోపిడీ: వరంగల్‌లో పోలీసుల హై అలర్ట్

కరీంనగర్‌లో భారీ దోపిడీ: వరంగల్‌లో పోలీసుల హై అలర్ట్

Published on

spot_img

కరీంనగర్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక PMJ జువెలరీ షాపులో ఐదుగురు దుండగులు తుపాకులతో చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన షాపు సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపి, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. షాపు రక్తసిక్తమైంది. దుండగులు భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గన్ మ్యాగజైన్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

​వరంగల్‌లో ముమ్మర తనిఖీలు

​కరీంనగర్ ఘటన నేపథ్యంలో పొరుగు జిల్లా అయిన వరంగల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పైఅధికారుల ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

నగర శివార్లలో మరియు ప్రధాన రహదారుల వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

నిందితులు తప్పించుకోకుండా సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

Latest articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలకలం: పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో భూ వివాదంపై విసిగిపోయిన గట్ల సురేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్

హనుమకొండలో విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి సోమవారం ప్రారంభించారు.
spot_img

Related Articles

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.