మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ డి. ఉమామహేశ్వరిపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థినులను మానసికక్షోభకు గురిచేయడం, శారీరక దాడులకు పాల్పడడం వంటి ఆరోపణలు రుజువు కావడంతో ఆమెను మహబూబాబాద్‌కు బదిలీ చేస్తూ గురుకుల సొసైటీ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కేవలం ఆలస్యంగా వచ్చారన్న కారణంతో 11 మంది విద్యార్థినులను ఆమె దారుణంగా కొట్టడంతో, బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. విద్యార్థినుల భవిష్యత్తును, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు చేపట్టిన విచారణలో ప్రిన్సిపాల్ తీరు తప్పుగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను తక్షణమే బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


