వరంగల్: నగరంలోని ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో రోగుల సహాయకులకు కష్టాలు తప్పడం లేదు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత కారణంగా రోగి కుటుంబ సభ్యులే ‘పేషెంట్ కేర్’ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోంది.
గురువారం ఉదయం ఎంజీఎం ఆసుపత్రిలోని వార్డు నుంచి ఓ పేషెంట్‌ను వైద్య పరీక్షల నిమిత్తం కేఎంసీ (KMC) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. సాధారణంగా ఈ పని చేయాల్సిన పేషెంట్ కేర్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో, చేసేదేమీ లేక కుటుంబ సభ్యులే స్వయంగా ఆ పేషెంట్‌ను స్ట్రెచర్‌పై తోసుకుంటూ వెళ్లారు.
రోగులను ఒక వార్డు నుండి మరో వార్డుకు మార్చడానికి కనీస సిబ్బంది లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు పేషెంట్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


