వరంగల్ క్రిస్టల్ గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈద్ తోఫా – ఈద్ ముబారక్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని, ముస్లిం సోదర సోదరీమణులకు దుస్తులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.



