HomeWarangal Newsఒక్క కాల్‌తో రెండు ప్రాణాలు కాపాడిన 108.. వరంగల్‌లో అరుదైన ఘటన

ఒక్క కాల్‌తో రెండు ప్రాణాలు కాపాడిన 108.. వరంగల్‌లో అరుదైన ఘటన

Published on

spot_img

ఒక్క కాల్‌తో రెండు ప్రాణాలు కాపాడిన 108.. వరంగల్‌లో అరుదైన ఘటన:

వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఓ గర్భిణీకి రైలులోనే సురక్షితంగా ప్రసవం జరగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 108 అత్యవసర సేవల సిబ్బంది వేగంగా స్పందించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన ఆర అంజుం (27) అనే మహిళ.. తన కుటుంబ కార్యక్రమంలో పాల్గొని బెంగళూరు నుంచి స్వగ్రామానికి రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలోనే పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెకు ఇది నాలుగో కాన్పు. ప్రయాణం మధ్యలోనే పురిటి నొప్పులు ఒక్కసారిగా తీవ్రంగా రావడంతో కుటుంబ సభ్యులు, సహ ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించి వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు.

అనంతరం 108 అత్యవసర సేవలకు సమాచారం అందించగా, ఈఎంటి కె. నాగరాజు, పైలట్ పి. అమర్ అత్యంత వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గర్భిణీ పరిస్థితిని పరిశీలించిన వారు తక్షణ వైద్య సహాయం అందిస్తూ రైలులోనే ప్రసవం నిర్వహించారు. వారి పర్యవేక్షణలో ఆర అంజుం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అత్యవసర పరిస్థితిలో 108 సిబ్బంది చూపిన చాకచక్యం, సమయస్ఫూర్తి వల్ల ప్రసవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తికావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో అందరూ ఊరట చెందారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.