గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్ డేట్‌లో మార్పు వచ్చింది. ముందుగా ప్రకటించిన మార్చి 26/27, 2026 తేదీకి బదులుగా ఇప్పుడు సినిమా ఏప్రిల్ 30, 2026న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.
మేకర్స్ అధికారికంగా ఈ అప్‌డేట్ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, VFX, సౌండ్ మిక్సింగ్, రీ-షూట్స్ వంటి పనులు పూర్తి స్థాయిలో జరగాల్సి ఉండటం, సినిమా నాణ్యతను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోర్సెస్ తెలిపాయి.
ఈ మార్పుతో మార్చి 26, 2026 స్లాట్ ఖాళీ అయింది. దీన్ని వెంటనే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ స్వాధీనం చేసుకుని, ఆ తేదీనే తమ సినిమా రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది.


